రాశీఖన్నా ఫిట్‌నెస్‌ రహస్యం ఇదేనంటా.. 

02 February 2024

TV9 Telugu

ఊహలు గుసగులసాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార రాశీఖన్నా. అనతికాలంలో తెలుగులో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

అనంతరం వరుసగా బడా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకొని కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయిందీ చిన్నది. 

ఇక ఊహలు గుసగుసలాడే సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన రాశీ ఖన్నా ఆ తర్వాత సన్నగా నాజుగ్గా తయారైంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. 

తన లేటెస్ట్‌ హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే ఈ బ్యూటీ.. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఏంటో గతంలో ఓ ఇటర్వ్యూలో తెలిపింది. 

అయితే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కోసం రాశీ ప్రత్యేకంగా ఎలాంటి పనులు చేయనని చెప్పుకొచ్చింది. అందరిలాగే వ్యాయామం చేస్తానని ఇవరించింది

అయితే ఎప్పుడు సంతోషంగా ఉంటానని, ఏ పని చేస్తున్నా ఆనందంతోనే చేస్తానని, అదే తన బాడీని ఫిట్‌గా ఉంచుతుందని నమ్ముతున్నట్లు రాశీ తెలిపింది. 

ఇదిలా ఉంటే రాశీ ఖన్నా ఇటీవల సినిమాలో విషయంలో కాస్త వెనబడినట్లు కనిపిస్తోంది. 2022 సర్దార్‌ తర్వాత మళ్లీ రాశీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు. 

అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ నటిస్తోంది. ఈ ఏడాదిలో ఈ సినిమాలు విడుదలకానున్నాయి.