‘కాంత’ ప్రపంచానికి స్వాగతం.. రానా దగ్గుబాటి..

30-JUlY-2023

నటుడు రానా మళ్లీ చిత్రలతో బిజీగా ఉన్నారు.

ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో ‘హిరణ్య కశ్యప’ పట్టాలెక్కనున్నట్లు ప్రకటించారు.

నటుడిగానే కాదు నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు అయన.

ఇప్పుడాయన మరో చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘కాంత’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ బహుభాషా చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మేరకు రానా మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా శక్తిని గుర్తు చేసే కథ మనకు చాలా అరుదుగా దొరుకుతుంది.

దుల్కర్‌తో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ‘కాంత’ ప్రపంచానికి స్వాగతం’’ అని పేర్కొన్నారు.