Ramya Krishna

ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది.. రమ్యకృష్ణ..

09 August 2023

Pic credit - Instagram

Ramya Krishna Picture

వెండితెరపై ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని జోడీలను ఉన్నాయి. అలాంటి వాటిలో రజనీకాంత్‌, రమ్యకృష్ణలది ఒకటి.

Ramya Krishna Pic

1999లో వచ్చిన ‘నరసింహ’ చిత్రంలో తర్వాత వీళ్లిద్దరూ కలిసి మళ్లీ 24 ఏళ్లకు ‘జైలర్‌’ మూవీలో కలిసి కనిపించనున్నారు.

Ramya Krishna Photo

రజనీకాంత్‌ కథానాయడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకులను అలరించనుంది.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పారు.

‘‘నరసింహ’లో అవకాశం వచ్చినప్పుడు మొదటి హీరోయిన్‌నా.. రెండో హీరోయిన్‌నా.. ఇలా ఏం ఆలోచించలేదు. రజనీకాంత్‌ సినిమాలో నేను భాగం కావాలనుకున్నాను.

అందుకే వెంటనే ఓకే చెప్పాను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమదే. ఆ సినిమాలో సౌందర్య ముఖం మీద నేను కాలు పెట్టే సన్నివేశం ఉంటుంది.

ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని భయపడ్డాను. ఇక ‘బాహుబలి’ నాకు మరో హిట్‌ను అందించింది. ఆ మూవీ ఇంతపెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు.

ఈ చిత్రం సమయంలో ‘రాత్రిపూట షూటింగ్‌ చేయను, కొద్దిరోజులు మాత్రమే సమయం ఇస్తాను..’  అనే షరతులకు రాజమౌళి అంగీకరించారు’’ అని తెలిపారు.