రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై కామెంట్ చేశారు
సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది రాజకీయాల్లో రాణించారు. ముఖ్యమంత్రులుగా సేవలు చేశారు. నటుడు విజయ్ కూడా తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు
ప్రజాసేవ చేసేందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడ్‌ర్ ఎవరున్నా సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం
ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదాగానీ వెనక్కి మాత్రం లాగకూడదు. భవిష్యత్‌లో విజయ్ గొప్ప రాజకీయనాయకుడు అవుతారని భావిస్తున్నా అని అన్నారు
అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని స్పష్టం చేశారు. మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని ఆమె అన్నారు
కాగా తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది ప్రముఖులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు
'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన నటుడు విజయ్ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గాపాల్గొంటున్నారు. 2026 ఎన్నికల లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు తమిళనాడులో హీరో విజయ్‌తోపాటు మరో హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో తమిళనాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి