01 AUGUST 2023

రియల్ గేమ్‌ ఛేంజర్‌ అంటూ..: రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవ్వనున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రేంజ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు చరణ్. జపాన్ లోనూ చరణ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా శంకర్ తన సినీ కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా రామ్ చరణ్ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. శంకర్ రియల్ గేమ్ చేంజర్ అని ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్.