టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తండ్రికి తగ్గ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. నిర్మాతలను చరణ్ అస్సలు ఇబ్బంది పెట్టరని సినిమాకు నష్టం వస్తే రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తారు అని టాక్ ఉంది.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్ చరణ్ డ్యాన్స్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే రామ్ చరణ్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు సంబంధించి షాకింగ్ విషయం వెల్లడైంది.
రామ్ చరణ్ కు ఏదైనా సాంగ్ కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే అస్సలు నచ్చదట. డ్యాన్స్ ప్రాక్టీస్ ను ఈ టాలీవుడ్ స్టార్ హీరో టైమ్ వేస్ట్ అని భావిస్తాడట.
సాంగ్ షూట్ సమయంలో కొరియోగ్రాఫర్ డ్యాన్స్ స్టెప్స్ ను చూపిస్తే అలవోకగా రామ్ చరణ్ ఆ స్టెప్స్ ను చేసేస్తాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చేస్తారట. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కాగా కఠినమైన స్టెప్స్ ను సైతం అలవోకగా ఈ హీరోలు వేస్తారు.
చరణ్, తారక్ ఈ మధ్య కాలంలో కలిసి కనిపించకపోయినా అవసరం ఉన్న ప్రతి సందర్భంలో ఒకరికొకరు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.