29 August 2023
మరోసారి సుమతో విడాకుల వార్తలపై స్పందించిన రాజీవ్ కనకాల..
బుల్లితెర నుంచి వెండితెర వరకు యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి, ఆమె యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుంది అంటూ చాలాకాలంగా, చాలా సందర్భాల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..
తాజాగా తన భర్త రాజీవ్ కనకాల కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. విడాకుల వార్తలు తనకు కొత్తేమి కాదని తెలిపారు.
అవి నిజం కాదు అని క్లారిటీ ఇచ్చినా.. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆ ప్రచారం ఆగడం లేదు.
మేము కలిసే ఉన్నాము అని చెప్పడానికి ఏ చేయాలో మాకు అర్థం కావడం లేదని రాజీవ్ కనకాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి రూమర్స్ వల్ల మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో, కాలేజీలో, ఫ్రెండ్స్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళ ఫ్రెండ్స్ “మీ అమ్మ, నాన్న విడిపోతున్నారు అంట కదా” అంటూ అడిగితే వాళ్లకి ఎంత కష్టంగా ఉంటుంది."
ఈ విషయంపై స్పందిస్తూ కొంచెం ఎమోషనల్ అయ్యారు రాజీవ్ కనకాల.. ఇక త్వరలోనే వీళ్ల కొడుకు హీరోగా రానున్నారు అని కూడా టాక్ నడుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి