వేంకటపతి రాజా ఆగమనం..

01-August-2023

రాఘవ లారెన్స్‌ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’.

రజనీకాంత్‌ ‘చంద్రముఖి’ కొనసాగింపుగా వస్తున్నా చిత్రమిది.

ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

తాజాగా సోమవారం లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల  చేసింది చిత్రబృందం.

అందులో పొగరు, రాజసంతో పాటు క్రూరత్వంతో ఓ రాజు వేషంలో కనిపించారు.

వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.