24 August 2023
సీక్వెల్స్ పై బడ్జెట్ విషయంలో కూడా భయపడని నిర్మాతలు.
ఓ సినిమా కోసం రెండేళ్లు టైమ్ తీసుకుంటేనే నిర్మాతలకు కంగారు పెరుగుతుంది. కానీ సీక్వెల్స్ కోసం మాత్రం ఏళ్లకేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు.
అయినా కూడా సీక్వెల్స్‌కు బడ్జెట్ పెరిగితే మేకర్స్‌కు కంగారు ఉండదా..? అసలేం జరుగుతుంది సీక్వెల్స్ విషయంలో..?
ఇక విజువల్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే రెండు మూడేళ్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే టైమ్‌లో సీక్వెల్స్ కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు దర్శకులు.
ఒక్కో సీక్వెల్ కోసం మూడేళ్ళకు పైగానే తీసుకుంటున్నారు. పుష్ప 2, కాంతార 2 , కేజిఎఫ్ 2 నే దీనికి నిదర్శనం.
కాంతార 2 కోసం 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ కేవలం 16 కోట్లతో తెరకెక్కితే, సీక్వెల్ కోసం ఏకంగా 10 రెట్లు బడ్జెట్ పెంచేసారు.
టైమ్ ఎంత తీసుకున్నా ఆ బిజినెస్ అలా ఉంది. కాంతార 400 కోట్లు వసూలు చేసింది.. సీక్వెల్ టార్గెట్ 1000 కోట్లు ఇప్పుడు.
పుష్ప 2 కూడా అంతే. 2021 డిసెంబర్‌లో పుష్ప విడుదలైంది. అప్పట్నుంచీ సీక్వెల్ చెక్కుతూనే ఉన్నారు సుకుమార్.
టైమ్ తీసుకున్నా పుష్ప 2 మార్కెట్ రేంజ్ కూడా 1000 కోట్లే. అందుకే ఎంత టైమ్ తీసుకున్నా నిర్మాతలకు కంగారేం లేదు.
గతంలో బాహుబలి 2, కేజియఫ్ 2, గదర్ 2 లాంటి వాటి కోసం ఎంత టైమ్ తీసుకున్నా.. వెయిట్ ఫర్ వర్త్ అన్నట్లే వాటి రిజల్ట్స్ వచ్చాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి