రెమ్యూనరేషన్ కంటే.. విలువైన గిఫ్ట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్లు
రజినీ హీరోగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ జైలర్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ప్రొడ్యూసర్ కళానిధి మారన్.. డైరెక్టర్ నెల్సన్‌ను ఓ కాస్ట్లీ లగ్జరీ కారుతో పాటు.. ఫ్యాన్సీ ఫిగర్ చెక్ ఇచ్చారు.
చిన్న సినిమాగా రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన ఫిల్మ్ బేబీ. ఇక ఈమూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌కు కూడా.. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కెఎన్ , మారుతీ క్లాస్టీ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.
కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ విరూపాక్ష. తేజు కంబ్యూక్ ఫిల్మ్ గా.. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ మూవీ ప్రొడ్యూసర్ సుకుమార్ నుంచి ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ లగ్జరీ బెంజ్ కారును గిఫ్ట్ గా అందుకున్నారు.
విక్రమ్ సినిమాతో .. ఇండస్ట్రీ హిట్ అందుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ కూడా.. ఆ సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు లాంబార్గినీ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.
అయితే తన రెమ్యూనరేషన్ అంత ఎక్స్‌పెన్సివ్ కాకపోయినా కానీ.. లోకనాయకుడు కమల్ హాసన్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌కు రీసెంట్‌గా ఓ కాస్ట్లీ వాచ్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.
రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఫిల్మ్ ఖిలాడీ. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బొక్క బోల్తా పడినప్పటికీ.. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్టర్ రమేష్ వర్మ రేంజ్ రోవర్ కార్‌ను గిఫ్ట్ గా పట్టేశారు.
తన డెబ్యూ ఫిల్మ్ ఉప్పెనతోనే.. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా కూడా.. ఈ సినిమా ప్రొడ్యూసర్ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఓ విల్లాను.. దాంతో పాటే ఓ లగ్జరీ కారును గిఫ్ట్ గా అందుకున్నారు.