ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రేజీ భామ ప్రియాంక మోహన్ 

Rajeev 

3 june  2025

Credit: Instagram

సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం తెలుగులో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది ఈ అందాల భామ. 

2019లో విడుదలైన ఓంత్ కథే హెల్లా అనే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ప్రియాంక ఆ తర్వాత కన్నడతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది.

అదే ఏడాదిలో న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా అందరి హృదయాలు గెలుచుకుంది

అందం, అభియనం.. అమాయకత్వంతో కట్టిపడేసింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేదు.

చివరిగా నాని నటించిన సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన ఓజీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.