ఇప్పటికీ.. ఎప్పటికీ ఆమె తోపు హీరోయిన్.. రెమ్యునరేషన్ తో నయా రికార్డ్
Rajeev
18 December 2024
ఓ స్టార్ హీరోయిన్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యురనేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ. 40 కోట్లు వసూలు చేస్తుంది.
బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న ఆ అందాల రాశికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ తార.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.
ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇదికొక రికార్డ్
అయితే ఈ రెమ్యునరేషన్ అనేది కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే తీసుకుంటున్నట్లు సమచారం.
ఇప్పుడు హాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక ఒక్క మూవీకి 5 మిలియన్ డాలర్స్.. అంటే భారతీయ కరెన్సీలో రూ.40 కోట్లు తీసుకుంటుందట.