16 August 2023

అందాలతో చిత్తు చేస్తున్న ప్రియా వడ్లమాని 

Pic credit - Instagram

ప్రియా వడ్లమాని అందరికీ సుపరిచితమే. ‘హుషారు’ లో ‘ఉండిపోరాదే..’ అనే రొమాంటిక్ సాంగ్ కి ఉన్న ఫ్యాన్స్ కి ఈమె బాగా తెలుసని చెప్పొచ్చు. 

ఆ ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది ప్రియా వడ్లమాని. అయితే హుషారు ఈమెకు మొదటి సినిమా కాదు. 

అంతకు ముందు కూడా ఈమె ‘ప్రేమకు రెయిన్ చెక్’ ‘శుభలేఖలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. 

అయితే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘హుషారు’. ఆ తర్వాత ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రాల్లో కూడా నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.

2022 చివర్లో వచ్చిన ‘ముఖచిత్రం’ అనే మూవీలో రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. 

ఓ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ, అందాలు ఆరబోస్తూ చాలా బోల్డ్ గా నటించగా.. మరో పాత్రలో బ్రాహ్మణ యువతిగా చాలా పద్దతిగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. 

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె అందాల ప్రదర్శన ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈమె చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.