21 August 2023

మహేష్ ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకే 

Pic credit - Instagram

మహేష్ బాబు  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

గుంటూరు కారం అంటూ టైటిల్‌ను ఖరారు చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు.  ఈ సందర్భంగా టీమ్ ఓ ఖతర్నాక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇటీవలే లండన్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం షూట్‌లో పాల్గోంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. 

అది అలా ఉంటే మహేష్ తాజాగా బిగ్ సీ ఈవెంట్‌లో పాల్గోన్న సంగతి తెలిసిందే. బిగ్ సీ 20వ వార్షికోత్సవ వేడుకలకు మహేష్ బాబు హాజరయ్యారు. 

అంతేకాదు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్ కోసం మహేష్ ధరించిన చెక్డ్ షర్ట్ చాలా మంది అభిమానులకు నచ్చింది.

దీంతో అసలు దీని ధర ఎంత ఉంటుందో అని సెర్చ్ చేస్తున్నారు. ఈ షర్ట్ డిజిల్ కంపెనీకి చెందినదిగా తెలుస్తోంది. దీని ధర 18,000 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. 

ఇక మొన్నటి వరకు మహేష్, తన ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నారు. అక్కడే బర్త్ డే సంబరాలను జరుపుకున్నారు. తాజాగా ఆయన తన ఫ్యామిలీతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

దీంతో   ఈనెల 16 నుంచి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ షురూ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో హీరో‌తో పాటు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరీలు కూడా పాల్గోంటున్నారు.