బాబోయ్‌.. వంటలక్కకి ఇంతపెద్ద కొడుకు ఉన్నాడా? ఫొటోలు చూశారా..

10 July 2024

TV9 Telugu

TV9 Telugu

బుల్లితెర సీరియల్‌ 'కార్తీకదీపం' తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. టాప్‌ రేటింగ్‌లో నడిచిన ఈ సీరియల్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది

TV9 Telugu

ఈ సీరియల్‌లో నటించిన నటులకు కూడా ఓ రేంజ్‌లో గుర్తింపువచ్చింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్‌కు తెలుగునాట సూపర్ క్రేజ్ వచ్చేసింది

TV9 Telugu

ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన 'కార్తీక దీపం' ధారావాహికలో ప్రేమి వంటలక్కగా నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే అతిశయోక్తికాదు

TV9 Telugu

ఇక ఈ మధ్యే కొంత గ్యాప్‌ తర్వాత 'కార్తీక దీపం 2: ఇది నవ వసంతం'  పేరిట మళ్లీ బుల్లితెర ఆడియన్స్‌ను పలకరించింది ప్రేమి. మరోసారి డాక్టర్ బాబు (పరిటాల నిరుపమ్)తో కలిసి ఈ ధారావాహికలో నటిస్తుంది

TV9 Telugu

కార్తీక దీపం పేరు తప్ప.. కథకి, పేరుకి ఎలాంటి సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే ప్రేమి-నిరుపమ్‌ల నటన కోసం బుల్లితెర ఆడియన్స్‌ ఈ సీరియల్‌ను బాగానే ఆదరిస్తున్నారు

TV9 Telugu

ఇక ప్రేమి పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే.. చాలా మంది ఆడియన్స్‌కి ఆమె గురించి పెద్దగా తెలియదు. ఆమెది కేరళ అని మాత్రమే తెలుసు.. కానీ ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దాదాపు ఎవరికీ తెలియదు

TV9 Telugu

తాజాగా ప్రేమికి తన కొడుకును సోషల్‌ మీడియా వేదికగా పరిచయం చేసింది. తన కొడుకుతో కలిసి చేసిన రీల్‌ ఒకటి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు వంటలక్కకి ఇంతపెద్ద కొడుకున్నాడా? అంటూ అవాక్కవుతున్నారు

TV9 Telugu

'మామ్ అండ్ సన్' అనే క్యాప్షన్‌తో చేసిన పోస్టులో ప్రేమి కొడుకు ఫుల్ ఫిట్‌గా హీరో లెవల్లో ఉన్నాడు. చూడటానికి చాలా స్టైల్‌గా కనిపించాడు. సినిమాలో ట్రై చేయమని చెప్పండీ అంటూ ప్రేమికి ఫ్యాన్స్‌ సలహాలిస్తున్నారు