షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పి అమెరికా వెళ్తున్న ప్రభాస్..డార్లింగ్ కి ఏమైంది..?
21 August 2023
మనం అనుకున్నామని అన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోవు డార్లింగ్. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అంటున్నాడు ప్రభాస్
మరికొన్ని సార్లు ఆలస్యాలు కూడా తప్పవు అని రెబల్ సైన్యానికి చూచాయిగా హింట్ ఇస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.
ఇంతకీ, ఇప్పటికిప్పుడు ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది..? అని అంటారా.? అయితే ఇది చూడాల్సిందే..
అది ప్రభాస్ హెల్త్ సీక్రెట్. అప్పుడెప్పుడో బాహుబలి రిలీజ్ టైమ్ నుంచీ ప్రభాస్ మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతూనే ఉన్నారు.
ఆ సినిమా విడుదల తర్వాత ఫిజియోథెరపీతో సెట్ చేద్దామని అనుకున్నారు. కానీ హెక్టిక్ షెడ్యూళ్లు, నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్ సాధ్యం కాలేదు.
కాలునొప్పితోనే సాహో మూవీని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రాధేశ్యామ్ టైమ్‌లో కాస్త బ్రేక్ తీసుకుని సర్జరీ చేయించారు.
ఆ తర్వాత అంతా సెట్ అవుతుందని అనుకున్నారు.. కానీ కాలేదు.. పైగా డార్లింగ్‌ని నొప్పి బాగా వేధి
ంచింది.
ఇప్పుడు నొప్పి తీవ్రత పెరగడంతో మోస్ట్ వాంటెడ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట డార్లింగ్. అయితే..
ప్రస్తుతం సెప్టెంబర్ 28న విడుదలకు రెడీ అవుతోంది ప్రశాంత్‌నీల్ సలార్.. ఈ సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ హాజరవుతారా?
లేకుంటే సోలోగా ఇంటర్వ్యూ ఇచ్చి హెల్త్ మీద ఫోకస్ చేస్తారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి