రామ్ చరణ్ వద్దు అని వదిలేసిన సినిమా చేసి హిట్ కొట్టిన ప్రభాస్

29-jul-2023

Pic credit - Instagram

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ఇంతకు ముందు రామ్ చరణ్ వద్దు అని ఛీ కొట్టిన కథతో ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఫాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలిచే స్థాయికి ప్రభాస్ ను తీసుకొచ్చిన డార్లింగ్ మూవీ ను రామ్ చరణ్ వద్దు అనుకున్నాడు.

18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డార్లింగ్ మూవీ 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ,యూత్ ఫుల్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం.

హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ సాధించింది.

ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే డార్లింగ్ మూవీ ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదు రామ్ చరణ్.

చరణ్ కు ఈ మూవీ స్టోరీ పెద్దగా నచ్చలేదట. అందుకే సున్నితంగా ఈ చిత్రం నాకు సెట్ కాదు అని రిజెక్ట్ చేశాడు.