మంచి కిక్ ఇచ్చేమంచి కిక్ ఇచ్చే డార్లింగ్ మూవీస్ ఇవే..

21 January 2025

Prudvi Battula 

2024 జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‎గా నిలిచింది. ఈ చిత్రం 1000 కోట్లకు దగ్గరలో ఉంది.

బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమా ప్రభాస్ కెరీర్‎లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రమిది.

బాహుబలి 1 ది బిగినింగ్ సినిమా 750 కోట్లు కలెక్ట్ చేసి సౌత్‎లో 500 కోట్ల క్లబ్‎ను ఓపెన్ చేసిన తొలి చిత్రమిది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఇది 715 కోట్లకు వసూళ్లు చేసింది.

తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహూ కచ్చితంగా చూడాలి. డిసాస్టర్ టాక్‎తో 439 కోట్ల వసూళ్లు చేసింది ఈ మూవీ.

మిర్చి సినిమా కూడా కచ్చితంగా చూడాల్సిందే. ఇందులో ప్రభాస్ అనుష్క శెట్టి జంటగా నటించారు. రిచా గంగోపాధ్యాయ మరో హీరోయిన్.

ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చి రెబెల్ మూవీ కూడా చూడాల్సిందే. ఇందులో తమన్నా కథానాయకి.

ప్రభాస్, కాజల్ అగర్వాల్ జోడిగా నటించిన రొమాంటిక్ చిత్రం డార్లింగ్. ఈ సినిమా ప్రభాస్‎కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చింది.