ప్రాజెక్ట్ కే కోసం.. తొలిసారి అలా చేస్తునం ప్రభాస్

టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ప్రభాస్ ఒకరు.

ప్రభాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ తో సైతం అత్యంత భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కమల్ కనిపించనున్నారు.

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 800 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

అయితే కమల్ తో పోటాపోటీగా నటించాలని భావించి సీన్లను ముందుగానే ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తోంది.

కమల్ ను మించి తన నటన ఉండే విధంగా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలయ్యాయి.

800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.