మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్..

30-JUlY-2023

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అయన నటిస్తున్న సలార్, కల్కి 2898AD సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్.

వీటితో పాటు మరో అందమైన ప్రేమకథ డార్లింగ్ ఖాతాలో చేరబోతుందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల సీతారామంతో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి ప్రభాస్ కోసం హను ఓ మంచి లవ్ స్టోరీ సిద్ధం చేసుకున్నారట.

ఈ కథ నచ్చడంతో డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట.