'ఇది నేను కోరుకున్న జీవితం కాదు'.. పవర్ స్టార్‌

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌ మువీ 'బ్రో'

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు

'బ్రో' మువీ జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ..

‘బ్రో’ మువీ మీ అందరికీ తప్పక నచ్చుతుంది. తెలుగు సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప సినిమాలు తీయగలం

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, రానాల బలమైన పాత్రలను నేను పోషించలేకపోవచ్చు

కానీ, సినిమా అంటే నాకు ప్రేమ.. సమాజం అంటే బాధ్యత. సినీ పరిశమ్ర ఏ ఒక్క కుటుంబానికీ చెందింది కాదు. ఇది అందరిది. రాజకీయం కూడా అంతే

ఇది నేను కోరుకున్న జీవితం కాదు. నటుడిని కావాలని, రాజకీయ నాయకుడిని అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు

భగవంతుడు అలా నడిపిస్తున్నాడు అని పవన్‌ కల్యాణ్‌ అన్నాడు