ఐబొమ్మ లో సినిమా చూస్తున్నారా ?? ఈ షాకింగ్ నిజాలు మీకోసమే
ఐ బొమ్మ తెలుగు ఓటీటీ కంటెంటెను ఫ్రీగా.. ఈజీగా.. మన ముందుకు తీసుకొచ్చిన ఈ సైట్.. చూస్తుండగానే.. విపీరీతమైన పాపులారిటీని గెయిన్ చేసింది.
మరి అలాంటి ఈ వీడియో స్ట్రీమింగ్ (ఐ బొమ్మ) సైటు సేఫా అన్ సేఫా ?? కాదా ?? తెలుసుకోవాలంటే.. జస్ట్ వాచ్ దిస్ స్టోరీ.
ఐబొమ్మ సేఫా.. కాదా.. ? అంటే సేఫ్ కాదనే అంటున్నారు టెకీస్ అండ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్. ఐబొమ్మ కూడా.. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే అన్ అఫీషియల్ సైట్.
ఈ సైట్.. ఎప్పటికీ ప్రమాదమే అని వారంటున్నారు. ఈ సైట్‌తో కూడా.. అందరికి సైబర్ ముప్పు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని తమ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్‌లలో కోట్ చేస్తున్నారు.
ఇక దానికి తోడు.. ఈ సైట్ ఓపెన్ చేయగానే.. కుప్పలుతెప్పలుగా యాడ్స్ డిస్‌ప్లే అవ్వడం మొదలైయ్యేది మీరు గమనించే ఉంటారు.
ఒక వేళ మన బ్రౌసర్‌లో యాడ్ బ్లాక్ లాంటి ఎక్స్‌టెన్షన్ ఎనబుల్లో ఉంటే.. వాటిని డిసబుల్ చేసే వరకు సైట్ ఓపెన్ కాకుండా ఉండే విషయాన్ని కూడా మీరు గమనించే ఉంటారు.
ఇలా పిచ్చి యాడ్స్ డిస్లే అవ్వడం.. పొరపాటున వాటిని క్లిక్ చేస్తే.. ఆ పేజీల్లోకి ఆటోమేటిక్‌గా రీ డైరెక్ట్ అవ్వడం ఐబొమ్మలో ఎక్కువైందని.. ఇదే ఇప్పుడు డేంజర్‌గా మారిందని వార్న్ చేస్తున్నారు.
యాడ్స్ కారణంగా.. లేక వాటిని క్లిక్ చేసిన కారణంగా.. రీడైరెక్టర్ అయ్యే సైట్లు ప్రమాదమని.. వాటి వల్ల.. మన మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్ ట్యాప్‌లలో.. హార్మ్ ఫుల్ మాల్వేర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.