20 August 2023

బ్యాడ్ టైం.. మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజ అవుట్..?

నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్‌ ప్లేస్‌ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్‌ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు.

ఈ సమయంలో వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ హెగ్డే కిట్టీ నుంచి వరుసగా జారీపోతున్నాయి.

మంచి రోజులు వస్తాయని ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే.

కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ హిట్ అయితే పాన్ ఇండియా లెవల్లో బిజీ అవ్వొచ్చని అనుకుంది పూజ

ఆ తరువాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ మీదే పెట్టుకున్నారు పూజా. కానీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది.

భారీ ఆశలు పెట్టుకున్న భాయ్‌ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో నార్త్‌లో పూజ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి.

అదే సమయంలో సౌత్‌లోనూ బుట్టబొమ్మకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రాజెక్ట్స్‌ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారు.

ఫ్యూచర్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు పూజా హెగ్డే. ప్రజెంట్‌ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న సినిమాలు తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెడతాయంటున్నారు.

 మరి రానున్న రోజుల్లో రాబోయే సినిమాలతోనూ అయినా అరవిందకు మంచి రోజులొస్తాయేమో చూడాలి.