17 August 2023

అవకాశాలు లేక ఆ హీరోలతో చెయ్యడానికి సిద్ధమైన పూజ హెగ్డే.

ఇండస్ట్రీలో హీరోయిన్లకు గోల్డెన్ టైమ్ కొన్ని రోజుల వరకే ఉంటుంది.కొన్నాళ్ళకు ఎంత పెద్ద హీరోయిన్‌కైనా ఛాన్సులు తగ్గడం సహజం.

ఇప్పుడు పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుందా..? మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ.. తాజాగా ఓ మెట్టు దిగుతున్నారు. 

టైర్ 2 హీరోలతో రొమాన్స్‌కు సై అంటున్నారు. ఈ లెక్కన రకుల్, తమన్నా రూట్‌లోనే పూజా కూడా వెళ్తున్నారా..?

టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టైర్ 2 హీరోల వైపు చూస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం సై అంటుంది.

టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తోనే జోడీ కట్టారు పూజా.

వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న హీరోల నుంచి పూజాకు అప్పుడే ఆఫర్స్ మొదలైపోయాయి. 

రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో పూజాకే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో రకుల్, తమన్నా కూడా ఇదే రూట్ ఫాలో అయ్యారు.

కెరీర్ మొదట్లో చిన్న హీరోలతో నటించిన తమన్నా, రకుల్.. స్టార్ డమ్ వచ్చాక పూర్తిగా స్టార్ హీరోలకే పరిమితం అయిపోయారు.

మళ్లీ ఆఫర్స్ తగ్గాక.. సందీప్ కిషన్, గోపీచంద్, నితిన్, సత్యదేవ్ లాంటి హీరోలతో రొమాన్స్ చేసారు తమన్నా.

అలాగే రకుల్‌ ప్రీత్ సింగ్ సైతం టాప్ స్టార్స్ అందరితోనూ నటించాకే.. వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలతో జోడీ కట్టారు.

పూజాహెగ్డే వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..