2014లో వచ్చిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఆ తర్వాత వరుసగా భారీ ఆఫర్లను దక్కించుకుంటూ, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుందీ అందాల బుట్టబొమ్మ.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈ చిన్నది తాజాగా అవకాశాలు అందుకోవడంలో వెనకబడిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే... కెరీర్ తొలి నాళ్ల నుంచి పూజా హెగ్డే చెక్కుచెదరని ఫిట్‌నెస్‌తో ఉంటుంది. తనదైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తన ఫిట్‌నెస్ సీక్రెట్‌కు సంబంధించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతకీ పూజా చెప్పిన విశేషాలు ఏంటంటే.
యోగా , ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది. ఎక్కువ సమయం జిమ్‌లో ఉండడనీ, ఇంట్లోనే పైలేట్స్ ఎక్సర్ సైజ్ చేస్తానని తెలిపింది.
ఒక్క రోజు కూడా పైలేట్స్ ఎక్సర్ సైజ్‌ను వదలనని అలాగే యోగా కూడా చేస్తూ తన ఫిజిక్ ను పర్ ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతున్నానని తెలిపింది.
ఇక కెరీర్ విషయానికొస్తే పూజా ప్రస్తుతం ఒకే ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. మరి ఈ ఏడాదైనా పూజాకు ఆఫర్లు క్యూకడుతాయో చూడాలి.