30 August 2023

మరో రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్.. 

Pic credit - Instagram

ఓ పక్క ఫ్యాన్స్‌ కానీ.. సినిమా లవర్స్‌ కానీ.. రీమేక్ సినిమాలొద్దంటూ.. నెట్టింట సినిమాల రిజెల్ట్స్‌ చూపించి మరీ ఓ రేంజ్‌లో గోల చేస్తుంటే..ఇంకో పక్క పవన్ మాత్రం తాను చేయాల్సిన పని చేస్తూనే పోతున్నారు. 

మరో సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇక ఇదే న్యూస్ బయటికి రావడంతో.. మరోసారి నెట్టింట తీవ్ర విమర్శల పాలవుతున్నారు. రీమేక్ రాజాగా ట్యాగ్ వచ్చేలా  చేసుకుంటున్నారు. 

ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టిన పవన్‌ కళ్యాణ్.. తాజాగా మరో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. 

త్రివిక్రమ్‌ రైటింగ్స్‌లో.. తమిళ్ హిట్ సినిమా రీమేక్ బ్రో హిట్టైన వేళ... తెరీ రీమేక్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ పరిగెడుతున్న వేళ.. మరో రీమేక్ సినిమాను అతి తొందర్లో మొదలెట్టనున్నారట పవన్‌.

రీసెంట్‌గా... ఓ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ ఓ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ రిమేక్ రైట్స్‌తో పవర్ స్టార్ పవన్‌ను కలిశారట. ఈ సినిమా తెలుగులో ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందంటూ.. పవన్‌ను ఒప్పించారట. 

దీంతో పవన్‌... తాను చేసిన ప్రామిస్‌కు కట్టుబడి ఈ సినిమాను.. ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి చేతుల్లో పెట్టారట. తననే డైరెక్ట్‌ చేయమన్నారట.

దీంతో సురేందర్‌ రెడ్డి ఈ మూవీ పనులను మొదలెట్టారని ఇండస్ట్రీలో టాక్. ఇక ఇదే విషయం తాజాగా నెట్టింట కూడా లీకై క్షణాల్లో వైరల్ అయిపోయింది. 

మళ్లో రీమేక్ సినిమానా.. ఇట్లా అయితే ఎట్లా బ్రో అని పవన్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేయగా.. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి