పక్కాగా లీక్ అని అనలేము కానీ.. కొన్ని కొన్ని సార్లు ఓ సినిమా స్టోరీ లైన్ సినిమా రిలీజ్కు ముందే.. కొన్ని కొన్ని ప్లాట్ ఫాంలలో పబ్లిష్ అవుతుంటుంది.
ఈ లీక్స్ ఆ సినిమాపై అంచానలను కూడా పెంచేస్తుంటుంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓజీ విషయంలోనూ ఇదే జరిగింది.
సుజీత్ డైరెక్షన్లో.. డీవీవీ ప్రొడక్షన్లో పవన్ చేస్తున్న డార్క్ యాక్షన్ డ్రామానే ఓజీ. ఈ మూవీ స్టోరీ లైన్ ఇప్పుడు నెట్టింట బయటపడింది.
ఫిల్మ్ బ్లాగ్ అయిన IMDB వెబ్ సైట్లో .. అఫీషియల్ గా ఓజీ పోస్టర్‌తో పాటు పబ్లిష్ అయింది.
వరల్డ్ మోస్ట్ పాపులర్ అండ్ అథారిటేటివ్ సోర్స్ ఫర్ మూవీస్ అండ్ టీవీ షో కంటెట్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న IMDB తన వెబ్ సైట్లో అప్‌కమింగ్ సినిమాలను డిస్‌ప్లే చేస్తుంటుంది.
అందులో సినిమా క్యాస్ట్ అండ్ క్రూ.. సినిమా జోనర్‌తో పాటు,.. స్టోరీ సినాప్సిస్ రాస్తుంది. ఇక ఓజీ ఫిల్మ్ ప్రొఫైల్ ను కూడా తాజాగా అప్డేట్ చేసిన ఈ సైట్.. అందులో స్టోరీ ఏంటని రాసుకొచ్చింది.
ఇక అకార్డింగ్ టూ IMDB పవన్ ఓజీ స్టోరీ ఏంటంటే..! "ఓ నార్మల్ టూరిస్టుగా బాంబేకి వచ్చిన ఓ వ్యక్తి.. యాక్సిడెంటల్‌గా.. గ్యాంగ్ స్టర్ అవుతాడు. క్రైమ్స్ చేస్తాడు.
మాఫియాతో పెట్టకుంటాడు. వాళ్లతో ఢీ అంటే ఢీఅంటాడు. ఇక ఈక్రమంలోనే తన ఫ్యామిలీని కోల్పోతాడు.
దీంతో మాఫియా మీద పగపెంచుకున్న ఆ వ్యక్తి మాఫియాలో ప్రతీ ఒక్కరినీ వెతికి మరీ ఊచకోత కోస్తాడు. చివరికి మాఫియానే లేకుండా చేస్తాడు."
ఇది మూడు ముక్కల్లో చెప్పాలంటే పవన్ ఓజీ స్టోరీ లైన్. ఇక IMDB పబ్లిష్ చేసిన ఈ స్టోరీ లైన్ చూసిన పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ గూస్ బంప్స్‌కు లోనవుతున్నామంటూ.. నెట్టింట కోట్ చేస్తున్నారు.