శాండల్‌వుడ్‌లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు
TV9 Telugu
అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది
TV9 Telugu
పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నటి పవిత్ర గౌడ ఎవరనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు
TV9 Telugu
అసలు ఆమె ఎవరు? పవిత్రకు పెళ్లయిందా? దర్శన్‌తో రిలేషన్‌లో ఉందా? వీరికి ఎందరు పిల్లలు ఉన్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇంటర్‌నెట్‌లో తెగ వెతికేస్తున్నారు
TV9 Telugu
ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లై, ఓ కూతురు కూడా ఉంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది
TV9 Telugu
ఫాదర్స్ డేకి ఆమె కూతురు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన పోస్టుతోపాటు కొన్ని ఫొటోలు కూడా షేర్ చూసింది. వీటిని చూసిన నెటిజన్లు పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు
TV9 Telugu
నిజానికి, నటి పవిత్రకు 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్‌తో పవిత్ర గౌడ విడాకులు తీసుకుంది
TV9 Telugu
అనంతరం పదేళ్లుగా దర్శన్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బట్టబయలైంది. తాజాగా చిత్రదుర్గ రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు