నిన్న మొన్నటి వరకు సలార్ ట్రైలర్ రిలీజ్ గురించి ఆరా తీసిన డార్లింగ్ ఫ్యాన్స్.. నేడు మాత్రం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనే దాని గురించే నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 28న అనుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టుపోన్ అయిందన్న వార్తల మధ్యలో.. ఇది అఫీషియలో.. అన్ అఫీషియల్లో అర్థం కానీ గందగోళం ఉన్నారు ఫ్యాన్స్.
గందగోళం మధ్యలో.. ఈ సినిమా టీం నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చేందుకు ఓ మూహూర్తం ఫిక్స్ అయిపోయిందట.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ మూవీ నుంచి సెప్టెంబర్ 8 న ఓ బిగ్ అప్డేడ్ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
అందర్లో కన్ఫూజన్ ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ తో పాటు.. ట్రైలర్ గురించి కూడ ఓ క్లారిటీ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ కానుందట.
అయితే సలార్ అఫీషియల్ హ్యండిల్లో కానీ.. లేక ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ.. హోంబలే హ్యండిల్లో కానీ.. ఈ న్యూస్ గురించి ఏ పోస్ట్ లేదు.
కానీ ఇండస్ట్రీలో మాత్రం సెప్టెంబర్ 8th సలార్ అప్డేట్ అనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అదే సోషల్ మీడియాకెక్కి రెబల్ ఫ్యాన్స్‌ను మరో సారి అలెర్ట్ చేసేసింది.
ఖచ్చితంగా ఈసినిమా రిలీజ్ డేట్ పైనే క్లారిటీ వస్తుందనే ఎక్స్‌పెక్టేషన్ వారందరిలో పెంచుతూనే.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ న్యూస్ .