తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఓజీ భామ.. 

11 November 2025

Pic credit - Instagram

Rajeev 

సినిమా ఇండస్ట్రీలో  ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది.

ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా.. అనుకుకుండా తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సక్సెస్ అయింది ఓ బ్యూటీ

ఆమె ప్రియాంక మోహనన్.. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి.

నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. 

ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు.

గ్లామర్ షోకు దూరంగా ఉన్నా.. ప్రియాంక అప్పియరెన్స్ గురించి మాత్రం చర్చ బాగానే జరిగింది. ఫైనల్ గా మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. 

సరిపోదా శనివారం, ఓజీ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రియాంక.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది.