వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోవడం కామన్. కానీ వయసుతో పాటు అందాన్నీ ద్విగుణీకృతం చేసుకుంటారు కొందరు. ఇది చూసి అందం వారి జీన్స్‌లోనే ఉందేమో అనుకుంటాం
TV9 Telugu
ఇటీవల ఆ ప్రశ్న టాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీకి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రాజకుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. అందాన్నీ వారసత్వంగా తెచ్చుకుందేమో అనుకున్నారంతా
TV9 Telugu
కానీ బామ్మల కాలం నాటి చిట్కాలు, ఆహార అలవాట్లే తన అపురూప లావణ్యానికి కారణమంటూ తన సౌందర్య రహస్యాల గురించి చెప్పుకొచ్చింది అదితి. అవేంటే మనం కూడా తెలుసుకుందాం
TV9 Telugu
చాలా మంది 'మీ సౌందర్య రహస్యం మీ జీన్స్‌లో ఉందా?’ అని చాలా మంది నన్ను అడుగుతారు. కానీ ఆది నేను తీసుకునే ఆహారంలో ఉందని చెబుతా. ముఖ్యంగా గ్లూటెన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటా
TV9 Telugu
ఎందుకంటే ఇది చర్మాన్ని పొడిగా మారుస్తుంది. గ్లూటెన్ ఉన్న పదార్థాలు, పాల పదార్థాలకు బదులుగా కాయగూరలు, ఆకుకూరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లు, బ్రౌన్‌రైస్, పప్పులు, డ్రైఫ్రూట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటా
TV9 Telugu
అలాగే రోజుకో టీస్పూన్ నెయ్యి తీసుకోవడం నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఇదే నా చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖంపై మొటిమలొస్తే గంధపు చెక్క అరగదీసిన చందనం పేస్ట్‌ను మొటిమలపై అప్లై చేస్తా
TV9 Telugu
అరగంటయ్యాక శుభ్రం చేసుకుంటా. చందనంలోని యాంటీసెప్టిక్ గుణాలు మొటిమల్ని, వాటి వల్ల చర్మంపై వచ్చిన వాపును దూరం చేస్తాయి. తద్వారా సమస్య పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుంటా
TV9 Telugu
40కి చేరువవుతున్నా నా ముఖంలో ముడతలు రాకపోవడానికి ఓ సీక్రెట్ ఉంది. అదే.. హైఅల్యురోనిక్ ఆమ్లం. ఈ ఫేస్ సీరమ్‌ను రోజుకు కనీసం రెండుసార్లు నా ముఖానికి అప్లై చేసుకుంటా. ఇది వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుందంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ