ఆ సౌత్ బ్యూటీస్‌ డేట్స్ నార్త్ మేకర్స్ క్యూ.. 

23 May 2025

Prudvi Battula 

నార్త్ ఎంట్రీ కన్నా ముందే నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.

యానిమల్‌, ఛావా సక్సెస్‌తో నార్త్‌ మేకర్స్ రష్మిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇన్నాళ్లు నార్త్ సినిమాకు నో అంటే నో అన్న లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

జవాన్ సినిమా సౌత్‌ వసూళ్లకు నయన్ గ్లామర్ చాలా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు హిందీలో అవకాశలు వస్తున్నాయి.

ప్రజెంట్ సౌత్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న నార్త్ మేకర్స్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవితో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ బాలీవుడ్ రామాయణ్‌లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, నెక్ట్స్ ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీలోనూ నటిస్తున్నారు.

శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆషికి 3' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. వరుణ్ థావన్‌తోనూ ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌ కూడా బాలీవుడ్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేశారు. బేబీ జాన్ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా... హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు మాత్రం మంచి రిసెప్షనే దక్కింది.