02 october

సినిమాల విషయంలో ఆచితూచి  అడుగులేస్తున్న  నివేదా థామస్..

Rajeev 

Pic credit - Instagram

మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్.. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

తొలి సినిమాలో అందంతో ఆకట్టుకుంది నివేదా థామస్ ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ..

ఆ తర్వాత నిన్నుకోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది.

అయితే వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. 

కొన్ని రోజులు సైలెంట్ అయిన ఈ బ్యూటీ శాకిని డాకిని వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మరోసారి నటిగా ప్రశంసుల అందుకుంది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో నటించిన నివేదా.. ఇటీవలే 35 ఇది చిన్న కథ కాదు అనే చిత్రంతో మరోసారి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.