6 August 2023
దీనివల్ల అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది..: మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ నిహారిక.. కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు.
మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
యాక్టింగ్ మాత్రమే కాకుండా.. యాంకరింగ్ లోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు.
కొద్దిరోజుల క్రితం తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంటున్నట్లు జూలై 4న అనౌన్స్ చేసింది.
ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరింది.
అయినప్పటికీ నిహారికపై నెగిటివి మాత్రం తగ్గలేదు. అయితే అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది నిహారిక.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి...
ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఒకేచోట ఆగిపోవాలని మనం కోరుకుంటే వాటి సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే.
ఈ జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక మనం సర్ ప్రైజ్ అవుతాము అంటూ ఓ కోట్ షేర్ చేసింది నిహారిక..
ఇక్కడ క్లిక్ చెయ్యండి