21 August 2023

నిధి అగర్వాల్ అప్డేట్ ప్లీజ్.. ఫ్యాన్స్ కామెంట్స్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ బ్యూటీ గా నిధి అగర్వాల్  అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నిధి అగర్వాల్.. 

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది.

మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ అయ్యింది.వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ సక్సెస్ ఇచ్చారు పూరిజగన్నాథ్.

ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేసింది నిధి అగర్వాల్. అక్కడ శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తుంది. నిధి అగర్వాల్.

ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా సాగుతుంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమా హిట్ అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎక్కువ వస్తాయని ఆశపడుతోంది.