‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ నుంచి కొత్త పాట..

అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌  పొలిశెట్టి’.

పి. మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

ఆగస్ట్‌ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

తాజాగా సోమవారం ఈ చిత్రం నుంచి మరో పాటని రిలీజ్‌ చేసింది చిత్రబృందం.

‘లేడీ లక్‌..’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది.

రథన్‌ సంగీతంతో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్‌ పాడారు.

ఈ చిత్రంలో అనుష్క  చెఫ్‌ అన్వితా రవళి శెట్టిగా, నవీన్‌ స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధుగా అలరించనున్నారు.