18 August 2023

టాప్ గేర్ లో స్పీడ్ పెంచిన నేహా శెట్టి.. అదృష్టం వరించినట్టే.

సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్.. ఎప్పుడు ఫేమస్ అవుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటే చాలు.. గోల్డెన్ లెగ్ అంటూ తెగ పొగిడేస్తారు.

దర్శక నిర్మాతలు కూడా ఆమె వైపే క్యూ కడతారు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రీలీల.

ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ శ్రీలీలకు గట్టి పోటీనిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉంది హీరోయిన్ నేహా శెట్టి. 

తొలినాళ్లలో రెండు సినిమాలు ఈమెకు డిజాస్టర్లుగా నిలిచాయి. తర్వాత విడుదలైన డీజే టిల్లు సినిమా మాత్రం నేహా శెట్టి అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది. 

ఆ తర్వాత ఈమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె ప్రస్తుతం బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను సొంతం చేసుకుంది.

చిన్న సినిమాలే అని నిరాశపడకుండా వచ్చిన సినిమాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది నేహా శెట్టి.

ఇకపోతే ఇప్పటికే రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపించడంతో పాటు కొన్ని వందల సంఖ్యలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

అంతేకాకుండా ఈ పాటకు నేహా శెట్టి అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసింది. ఈ పాటలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది నేహా శెట్టి.