రీఎంట్రీ ఇవ్వనున్న నజ్రియా.. కానీ సినిమాల్లోకి కాదట !!

04 August 2023

Pic credit - Instagram

మాలీవుడ్‌ భామ నటి నజ్రియా మొదట మాతృభాషలో హీరోయిన్‌గ  పరిచయమైంది. 

తరువాత తమిళంలో నేరం, రాజారాణి, నయ్యాండి, చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. 

హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ ఉన్నప్పుడే నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని తర్వాత నటనకు దూరమైంది.

నజ్రియా చాలా గాప్ తర్వాత తెలుగులో నానితో అంటే సుందరానికి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

ఆ చిత్రం పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో మరో అవకాశం రాలేదు.

మళ్లీ ఇప్పుడు తమిళంలో నటించడానికి సిద్ధమవుతోందనేది తాజా సమాచారం. 

అయితే ఈసారి నటించేది చిత్రంలో కాదు. వెబ్‌ సిరీస్‌లో నట.

దర్శకుడు విజయ్‌ ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్‌ సిరీస్‌లో నజ్రియా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. 

సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.