Nayak

17 August 2023

చిరు బర్త్ డే స్పెషల్ రీ రిలీజ్ కానున్న చరణ్ సినిమా

Pic credit - Instagram

Nayak Pics

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ రీ రీలీజ్అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. 

Nayak Photos

ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి.

Nayak Latest Pics

అయితే కొందరి హీరోల డిజాస్టర్ సినిమాలు తిరిగి విడుదల అవుతూ ఇప్పుడు భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇలా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలు వచ్చాయి.

కేవలం తెలుగు హీరోలు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హీరోలు నటించి తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన సినిమాలను కూడా తిరిగి విడుదల చేయడం విశేషం.

ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పలు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. 

అయితే చిరంజీవి పుట్టినరోజు రానున్న నేపథ్యంలో  రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 22వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చరణ్ మరియు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించగా ఈ సినిమా 2013 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.