5 August 2023

నేచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ..

నేచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకులకు గట్టిగా నమ్ముతారు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు నాని.

అందుకే ఆయన సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకున్న ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తూ ఉంటారు.

ఈ కుర్ర హీరో కూడా హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

నాని ఇప్పుడు ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నారని తెలుస్తోంది.

నాని సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని అని తెలిసిందే. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్ ను ఇమిటేట్ కూడా చేస్తుంటారు.

ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో నాని కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

జైలర్ సినిమాతర్వాత రజిని టి.జె.జ్ఞానవేల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.