నాలుగేళ్లుగా ఆ సమస్యతో బాధపడుతున్నాను.. నందితా శ్వేత..
నిఖిల్ ‘ఎక్కడికి పోతావురా చిన్నవాడా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది నందితా శ్వేత.
ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో ఆకట్టుకుంది ఈ భామ.
తర్వాత శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, అక్షర వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల అశ్విన్ బాబుకి జోడిగా హిడింబ చిత్రంలో నటించింది.
జులై 20న విడుదల కానున్న చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది నందిత.
ఈ చిత్రం ప్రమోషన్లలో తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.
నాలుగేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల సమస్యతో బాధపడుతున్నానని, వ్యాయామాలు చేయలేనని చెప్పింది.
అయితే మూవీ కోసం వ్యాయామాలు చేయల్సి వచ్చింది. ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోతే ఈ సమస్య మరింత పెడుతుంది.
కానీ హిడింబ మూవీ కోసం అన్నీ భరించి బరువు తగ్గానని ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి