18 August 2023
నమ్రతకు మహేష్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అదే...
Pic credit - Instagram
నమ్రత శిరోద్కర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మహేష్ బాబును పెళ్లి చేసుకున్న
తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
మహేష్ బాబుతో కలిసి నటించడం వంశీ సినిమా సమయంలో ఈమె ఆయనతో ప్రేమలో పడి అనంతరం వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఒక నగల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నమ్రత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు తనకు ఇచ్చినటువంటి మొదటి గిఫ్ట్ గురించి కూడా ఈమె ఈ సందర్భంగా రివిల్ చేశారు.
మహేష్ బాబు తనకు మొట్టమొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ వెడ్డింగ్ రింగ్ అని తెలియజేశారు. ఆయన తనకు ఇచ్చిన గిఫ్
ట్ అదేనని ఈమె తెలిపారు.
ఇకపోతే నాకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదని ఎక్కడికి వెళ్లినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానని నమ్రత తెలియజేశారు.
కానీ తాను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి తనకు ఒక సాయిబాబా ఉంగరం ఇచ్చిందని ఆ ఉంగరం అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి