ప్రభాస్ 'కల్కి' సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడే..

8 August 2023

Pic credit - Instagram

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  ‘కల్కి 2898 ఏడీ’.

టీవల వచ్చిన  గ్లింప్స్‌ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది.

కాగా ఈ చిత్రం వాయిదా పడనుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.

ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

‘‘కల్కి’ షూటింగ్‌ ఇంకా కొంతభాగమే మిగిలుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రస్తుతం నా ఏకాగ్రతంతా దానిపైనే ఉంది.

అది పూర్తయ్యాక విడుదల తేదీ గురించి ఆలోచిస్తాం. ఒక మంచి రోజు చూసుకుని దీని గురించి ప్రకటిస్తా.

ఈ సినిమాలో అందరూ ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ ఇలాంటి లుక్‌లో కనిపించలేదు.

అందుకోసమైనా ప్రేక్షకులంతా ఈ సినిమా చూడాలి. థియేటర్‌కు వచ్చిన వారంతా కొత్త అనుభూతి పొందుతారు’’ అని తెలిపారు.