మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు ధన్యవాదాలు.. మృణాల్ ఠాకూర్..

6 August 2023

సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైమంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

ఈ మూవీ తో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంది మృణాల్. పలు భాషల్లో వరుస ఛాన్స్‌లు లభిస్తున్నాయి. 

దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తమిళం, తెలుగుతో పాటు కన్నడంలోనూ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. 

బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సీతారామం మూవీ అడియన్స్ ముందుకు వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

“డియర్ ఆడియన్స్.. నటిగా నా మొదటి సినిమా సీతారామం.

నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించి మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు ధన్యవాదాలు.

మరిన్ని సంవత్సరాలు విభిన్నమైన పాత్రలతో మీకు వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశారు మృణాల్.