‘హాయ్‌ నాన్న’ నుంచి మృణాల్‌ లుక్..

02-August-2023

నాని హీరోగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’.

ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక.

శౌర్యవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా మంగళవారం మృణాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ని విడుదల చేశారు.

కుటుంబ కథ చిత్రంగా ‘హాయ్‌ నాన్న’ డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమాకి  హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు.