2023లో అట్రాక్ట్ చేసిన వెబ్ సిరీస్‌లు.. మీరేమైనా మిస్ అయ్యారా.?
25 December 2023
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముగ్గురు భార్యా బాధితుల కష్టాలను ఎంతో ఫన్నీగా చూపించారు.
ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో వెబ్ సిరీస్ ఫర్జి. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా దొంగనోట్ల తయారీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ డీకే దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రశంసలు సైతం అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది.
నాగ చైత్యన లీడ్ రోల్‌లో నటించిన దూత వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జర్నలిజం నేపథ్యంలో హారర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో వెబ్ సిరీస్ కాలాపాని. అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు కలుషితం కావడానికి కారణమేంటన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిందీ సిరీస్.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన ది రైల్వేమెన్ వెబ్ సిరీస్ ఈ ఏడాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించారు.