మెహరీన్ మాయ.. సినిమాలు నిల్లు.. సోషల్ మీడియాలో క్రేజ్ ఫుల్లు..  

Rajeev 

23 May 2025

Credit: Instagram

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ మెహరీన్. 

ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది.

జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గుతాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది.

కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది

ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడుపుతుంది మెహరీన్.

మెహరీన్ ఇంతవరకూ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాతోనే ఈ చిన్నది అభిమానులను ఆకట్టుకుంటుంది.