రొమాంటిక్ లుక్ లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. ఏమి అందం గురూ

Phani CH

22 May 2025

Credit: Instagram

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురు ఈ ముద్దుగుమ్మ .

మలయాళ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్ కూడా ఒకరు. అక్కినేని అఖిల్ హీరోగా హ‌లో సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

అందరిలా ఏదో సినిమాలు చేశాను అన్నట్టు కాకుండా తనదైన ఒక యూనిక్ స్టైల్ ఫాలో అయ్యారు అంటున్నారు నెటిజన్స్.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. చేసిన కొద్దీ సినిమాలైనా తనదైన మార్క్ చూయిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణించారు.

ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి.

చేసేదేమీ లేక మలయాళం వైపు అడుగులు వేసిన ఈమె.. అక్కడే వరుస అవకాశాలు అందుకుంటూ మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇకపోతే మలయాళంలో బిజీగా మారిన ఈమె చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది.