మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, మహానటి కీర్తి సురేష్ సోదరిగా కనిపించింది.
అక్కినేని సుశాంత్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన భోళాశంకర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఎప్పటిలాగే తనదైన యాక్టింగ్ స్టైల్, డ్యాన్స్, యాక్షన్, మేనరిజమ్స్‌తో మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి.
డైరెక్టర్ మెహర్ రమేష్ టేకింగ్ అభిమానుతో పాటు సినీ ప్రియులను బాగా నిరాశపర్చింది. సుమారు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళాశంకర్ ఓ మోస్తారు వసూళ్లు మాత్రమే సాధించింది.
ఇదిలా ఉంటే చిరంజీవి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అనుకున్న సమయానికంటే ముందుగానే భోళాశంకర్ ఓటీటీలోకి వచ్చేస్తోందట.
భోళాశంకర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.30 కోట్లకు పైగానే అగ్రిమెంట్ కుదుర్చుకుందట.
ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. నెగెటివ్ టాక్ రావడంతో ముందుగానే స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారని టాక్.
సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం సెప్టెంబర్ 18 నుంచి భోళాశంకర్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నరని ప్రచారం జరుగుతోంది.
అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భోళాశంకర్ సినిమాను నిర్మించారు.