మెగాస్టార్ చిరంజీవి చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు

03 August 2023

Pic credit - Twitter

ఇటీవల విడుదలైన బేబీ చిత్రం అంచనాలను దాటుకుంటూ మంచి వసూళ్లను కైవసం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో భాగంగానే ఆ చిత్ర బృందం జులై 30న హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్‌ని ఆహ్వానించారు. 

ఈ వేడుకల్లో కనిపించిన చిరంజీవి చేతికున్న వాచ్ చాలా మందిని ఆకర్శించింది. 

ప్రస్తుతం ఈ వాచ్ ధర గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర 230000 డాలర్లు లేదా రూ. 1.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా. 

ఇది రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ కావడం గమనార్హం.